Sunday, December 22, 2024

మార్చిలో ఎపి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మార్చి నెలలో ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మార్చి 1 నుంచి మార్చి 20తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 18 నుంచి మార్చి 30 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News