Monday, December 23, 2024

టెన్త్ పేపర్ లీక్.. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపి మాజీ మంత్రి, టిడిపి నాయకుడు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ కొండాపూర్ లోని ఆయన నివాసంలో నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నారాయణను పోలీసులు చిత్తూరుకు తరలిస్తున్నారు. ఎపిలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల సమయంలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం తెలసిందే. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాండ్ నుంచి తెలుగు పేపర్ లీకైంది. పరీక్ష ప్రారంభమయ్యాక ఉదయం 9.57గంటలకు వాట్సాప్ లో ప్రశ్నాపత్రం బయటకొచ్చింది. నారాయణ స్కూల్ సిబ్బంది గిరిధర్ వాట్సాప్ నుంచి పేపర్ లీక్ అయిన్నట్లు పోలీసులు నిర్ధారణ వచ్చారు. అనంతపురం, శ్రీకాకుళం, కర్నూల్ లో వాట్సాప్ ల్లో ప్రశ్నాపత్రం బయటికొచ్చింది. దీంతో నారాయణ ప్రమేయంతోనే ఇదంతా జరిగినట్లు భావించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో నారాయణను చిత్తూరు పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.

AP 10th Question Paper leak: Ex Minister Narayana Arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News