- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ముఖం చాటేశారు. మంగళవారం జలసౌధలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదలశాఖ అధికారులు హాజరు కావాల్సివుంది. అయితే ఏపికి చెందిన నీటిపారుల శాఖ అధికారులు తాము ఇతర పనుల్లో బిజిగా ఉన్నందున బోర్డు సమావేశానికి హాజరు కాలేమని తెలిపినట్టు సమాచారం . దీంతో చేసేదేమి లేక గోదావరి యాజమాన్యబోర్డు సమావేశాన్ని వాయిదా వేశారు. తదుపరి సమావేశం వివరాలను త్వరలోనే తెలియపరుస్తామని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -