Friday, November 15, 2024

క్యాట్ కరుణించేనా?

- Advertisement -
- Advertisement -

కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను
ఆశ్రయించిన తెలుగు రాష్ట్రాలకు
చెందిన పలువురు ఐఎఎస్‌లు
నేడు విచారణ

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఎపి, తెలంగాణ కేడర్‌కు చెందిన పలువురు ఐఏఎస్‌లు ఆశ్రయించారు. డిఓపిటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు క్యాట్‌లో పిటీషన్లు దాఖలు చేశారు. పిటీషన్‌లు దాఖలు చేసిన వారిలో వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన ఉన్నారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు ఐఏఎస్‌లు కోరగా, ఎపిలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కోరారు. ఈ నలుగురు ఐఏఎస్‌లు వేర్వేరుగా ఈ పిటీషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టనుంది. ఇరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు డిఓపిటి ఉత్తర్వుల మేరకు ఆయా రా్రష్ట్రాల్లో ఈనెల 16వ తేదీన రిపోర్టు చేయాల్సి ఉండగా, అంతలోపు క్యాట్ ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

AP and Telangana IAS resorted to CAT

ఎపి విభజన నేపథ్యంలో సర్ధుబాటు

ఎపి విభజన నేపథ్యంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాలకు కేంద్రం ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను కేంద్రం సర్దుబాటు చేసింది. అయితే, ఇందులో కొందరు అధికారులు తమను ఎపి కేడర్‌కు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు తెలంగాణ కేడర్‌గా గుర్తించాలని కోరుతూ వారు పలు కారణాలను చూపించారు. అయితే, ఈ విషయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్‌ను ఆశ్రయించగా అధికారుల అభ్యర్థనను క్యాట్ పరిగణలోకి తీసుకుంది. అయితే, ఈ తీర్పుపై డిఓపిటి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. 2023 మార్చిలో పిటిషన్‌పై విచారించింది. అధికారుల అభ్యర్థనను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిన్‌ను కేంద్రం ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఏర్పాటు చేసింది. కమిటీ ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల అభ్యర్థనలను పరిశీలించడంతో పాటు వారిని వ్యక్తిగతంగా విచారించి వారి అభ్యర్థలను తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News