Tuesday, January 21, 2025

ఈనెల 27 నుంచి ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. మొదటి రోజున గవర్నర్ ప్రసంగం, బిఎసి సమావేశం ఉంటాయి. రెండో రోజు సంతాప తీర్మానాలు, వాయిదా ప్రకటన ఉంటాయి. అనంతరం రెండో విడత సమావేశాలు మార్చి 6 నుంచి ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాలను మొత్తం 13 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రెండు విడతల్లో జరపనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News