Saturday, December 21, 2024

మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి లోక్ సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎపిలో లోక్ సభ ఎన్నికలతోపాటే మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా, లోక్ సభ ఎన్నికలను మొత్తం ఏడు విడతల్లో నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. నాలుగో విడతలో ఎపి, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News