Monday, January 20, 2025

ఎపి బిజెపి నేత నగ్న వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలలో ఇద్దరు బిజెపి నేతల నగ్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిజెపి పార్టీకి చెందిన మహిళతో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వీడియో కాల్ మాట్లాడుతూ నగ్నంగా కనిపించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో బయటకు రావడంతో బిజెపి నాయకత్వం అప్రమత్తమైంది. వీడియో వ్యవహారంపై విచారణ చేసి తమకు నివేదిక ఇవ్వాలని పార్టీ పెద్దల ఒక నాయకుడికి అప్పగించినట్టు సమాచారం. గుంటూరు పార్టీ జిల్లా ముఖ్య నాయకుడి వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రెండు వీడియోలు బిజెపి నేతలవి బయటకు రావడంతో బిజెపి ఉలిక్కిపడింది. రెండు వీడియోలు సోషల్ మీడియాలో రావడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. 2022వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం వైఎస్ఆర్ సిపి ఎంపి గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అప్పట్లో అది ఫేక్ వీడియో అని పోలీసుల విచారణలో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News