Sunday, December 22, 2024

ఎపిలో టిడిపి,వైసిపిలకు ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్సే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్‌లో వైసిపి,టిడిపిలకు బిఆర్‌ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయమని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు ఆంధ్ర ప్రజలను మోసగించామని ఆయన విమర్శించారు. ఆదివారం గుంటూరు నగరంలోని ఆటోనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ ఎపి రాష్ట్ర కార్యాలయాన్ని డాక్టర్ తోట ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ కార్యాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖ మాట్లాడుతూ టిడిపి,వైసిపి పార్టీలు రాష్ట్రాన్ని ఆథోగతి పాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి వైఫల్యాలతో విసుగెత్తిన ప్రజలకు మరే ప్రత్యామ్నాయం లేక వైసిపికి ఓటు వేశారన్నారు. అభివృద్ధి శూన్యం, అప్పులు ఘనం అన్న చందంగా ఎపి పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు.

ఆకాల వర్షాలతో అతాలకుతలమైన రైతాంగానికి ప్రభుత్వం సాయమందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 31 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వైపిపి ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేస్తుంటే 31 మంది ఎంపిలు ఉండి ఏం మాట్లాడటం లేదని విమర్శించారు. మోదీ అంటే జగన్‌కు కేసుల భయం అని, చంద్రబాబు మోదీతో పోత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ సిఎం కెసిఆర్ మాత్రమే మోదీని ధీటుగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. మోదీని నిలదిసే సత్తా కెసిఆర్‌కే ఉందన్నారు. కెసిఆర్ ఒక్క తెలంగాణ, ఎపి, మహారాష్ట్రలకే కాదని దేశం మొత్తానికి నాయకత్వం వహిస్తారని అన్నారు. బిఆర్‌ఎస్ తరుఫున ఎపికి చెందిన వారే సిఎం అవుతారనే విషయాన్ని గుర్తించుకోవాలని పేర్కొన్నారు.

ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కెసిఆర్ ప్రధాని కాగానే వాటిని తిరిగి వెనక్కి తీసుకుంటామని బహిరంగంగా ప్రక్రంటించారని ఆయన గుర్తు చేశారు. ఈ దేశానికి నాయకత్వం వహించే సత్తా కెసిఆర్‌కు ఉందన్నారు. ఎపికి ప్రత్యేక హోదా విషయం ఏమైందని వైసిపిని ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏమయ్యాయని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News