Sunday, December 22, 2024

రేపు బిఆర్‌ఎస్ ఎపి కార్యాలయం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ నూతన కార్యాలయాన్ని ఆదివారం గుంటూరులో ప్రారంభించనున్నారు. గుంటూరు నడి బొడ్డున ఐదంతస్థుల భవనంలో అన్ని హంగులతో కూడిన బిఆర్‌ఎస్ ఎపి కార్యాలయాన్ని ఈ నెల 21న ఉదయం 11.35 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, రిటైర్డ్ ఐఎఎష్ అధికారి డాక్టర్ తోట చంద్ర శేఖర్ ప్రారంభించనున్నారు.

ఈ కార్యాలయంలో తొలి రెండు అంతస్థులు కార్యకర్తల సమావేశ మందిరాలు ఉండగా, మూడు, నాలుగు అంతస్థుల్లో నేతల క్యాబిన్లు ఉన్నాయి. ఐదో అంతస్థులో రాష్ట్ర అధ్యక్షుడి కార్యాలయం ఏర్పాటు చేశారు. బిఆర్‌ఎస్ ఎపి కార్యాలయం ప్రారంభోత్సవానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ ఎపి అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News