Wednesday, January 22, 2025

ఎపి బిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ నియామకం..

- Advertisement -
- Advertisement -

ఎపి రాష్ట్ర బిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని అన్నారు. పార్థసారథి సేవలు కూడా ఉపయోగించుకుంటామన్నారు. బిఆర్‌ఎస్‌కు ఇవాళ మంచి వజ్రాలు దొరికాయని భావిస్తున్నానని అన్నారు.

పైగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంచి పనిని మొదలుపెట్టామన్నారు. ఆ రాష్ట్రంలో సిట్టింగ్ శాసనసభ్యులు కూడా బిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆశ్చర్యపరిచే చేరికలు త్వరలోనే ఉంటాయని కెసిఆర్ తెలిపారు. తోట చంద్రశేఖర్ వారి కర్తవ్య నిర్వహణలో పూర్తిగా విజయం సాధించాలని ఈ సందర్భంగా తాను కోరుకుంటున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. ఆయనపై తనకు సంపూర్ణమైన విశ్వాసముందన్నారు. తప్పకుండా వారు విజయం సాధిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News