Friday, November 22, 2024

ఎపి బడ్జెట్ @ 2.86 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టారు. మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కినందకు సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టోను సిఎం జగన్‌ పవిత్ర గ్రంథంగా భావించారని తెలియజేశారు.
సంపూర్ణ పోషణం పథకం ద్వారా గర్భిణీలకు మేలు జరుగుతుందని, 99.81 పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించామని, జగన్న గోరుముద్ద కోసం రూ.1910 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారు. 10,893 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించామని, 10,216 వ్యవసాయ గోదాములు నిర్మించామని, 82299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించామని బుగ్గన చెప్పారు. వైఎస్‌ఆర్ కల్యాణ మస్తు షాదీ తోపా కింద రూ.350 కోట్లు, కాపు నేస్తం ద్వారా రూ.2029 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా రూ.1268 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు ఉండగా జిఎస్‌డిపిలో రెవెన్యూ లోటు 1.56 శాతంగా ఉందని బుగ్గన వెల్లడించారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్: 

బడ్జెట్ మొత్తం:   రూ.2,86, 389 కోట్లు

రెవెన్యూ వ్యయం:రూ.2,30,110 కోట్లు

మూలధన వ్యయం: రూ.30, 530 కోట్లు

రెవెన్యూ లోటు: రూ.24,758 కోట్లు

ద్రవ్యలోటు: రూ. 55,817 కోట్లు

జిఎస్‌డిపిలో ద్రవ్యలోటు 3.51 శాతం

జిఎస్‌డిపిలో రెవెన్యూ లోటు 1.56 శాతం

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News