Tuesday, January 21, 2025

ఎపి బడ్జెట్ హైలెట్స్

- Advertisement -
- Advertisement -

అమరావతి: శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. 2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రసగించారు. పతనం అంచున ఎపి ఆర్థిక వ్యవస్థ ఉందని, గత ప్రభుత్వ నిర్వాకంతో ఎపి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు. గత ప్రభుత్వం పన్నులను దారి మళ్లించిందని, గత ప్రభుత్వం పరిమితికి మించిన రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకుందని, కేంద్ర పథకాల నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పునర్నిర్మాణం నేటి తరం చేతుల్లో ఉందని, సరళ ప్రభుత్వం… ప్రభావంత పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని  స్పష్టం చేశారు. విభజనా నాటి విషయాలను కూడా ప్రస్తావించారు. శాశ్వత రాజధాని లేకుండా ఎపి విభజన జరిగిందని దుయ్యబట్టారు.

ఎపి బడ్జెట్:

  • రూ. 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు.
  • మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు.
  • రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.
  • ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు.
  •  జిఎస్ డిపిలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం.
  • జిఎస్ డిపిలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.

పూర్తి కేటాయింపులివే..

  • రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.
  • రూ. 4,3402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్
  • జలవనరులు రూ. 16,705 కోట్లు
  • పాఠశాల విద్య రూ. 29,909కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ. 18,421కోట్లు
  • పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 16,739 కోట్లు
  • పట్టణాభివృద్ధి రూ. 11,490 కోట్లు
  • ఆర్ అండ్ బీ రూ. 9,554 కోట్లు
  • గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు
  • పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు
  • ఇంధన రంగం రూ. 8,207 కోట్లు
  • యువజన, పర్యాటక, సాంస్కృతిక 322కోట్లు
  • పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు
  • సంక్షేమం రూ.4,376 కోట్లు
  • మహిళ, శిశు సంక్షేమం రూ. 4,285కోట్లు
  • ఉన్నత విద్యకు 2,326 కోట్లు
  • మానవ వనరుల అభివృద్ధి రూ. 1,215కోట్లు
  • పర్యావరణ, అటవీ రూ. 687 కోట్లు
  • యువజన, పర్యాటక, సాంస్కృతిక 322కోట్లు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News