- Advertisement -
అమరావతి: అంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. వైయస్ఆర్ జిల్లా పేరును.. వైయస్ఆర్ కడప జిల్లాగా మారుస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
ఎస్సి వర్గీకరణ అంశంపైనా కేబినేట్‌లో చర్చ జరిగింది. ఈ అంశంపై రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమెదం తెలిపింది. వీటితో పాటు అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాల నిర్ణయాలను ఆమోదముద్ర వేసింది. ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్ట సమరణ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. వీటితో పాటు కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
- Advertisement -