Monday, December 23, 2024

మెగా డిఎస్సీకి ఏపి మంత్రివర్గం ఓకే

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు 6,100 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. బుధవారం సమావేశమైన మంత్రివర్గం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇంధన రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News