Wednesday, January 22, 2025

అమరావతే రాజధాని

- Advertisement -
- Advertisement -

ఆర్థిక, ఆధునిక రాజధానిగా
విశాఖ కేంద్ర సహకారంతో
పోలవరం పూర్తి ఆంధ్రప్రదేశ్‌లో
ఇక ప్రజాపాలన ఎన్‌డిఎ పక్ష
నేతగా ఎన్నికైన అనంతరం
టిడిపి అధినేత చంద్రబాబు
బాబు పేరును ప్రతిపాదించిన
పవన్ కల్యాణ్..బలపరిచిన
పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు
ఆమోదించిన కూటమి సభ్యులు
నేడు ఆంధ్రప్రదేశ్ సిఎంగా
ప్రమాణస్వీకారం

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర రాజధాని అమరావతేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదని తేల్చి చెప్పారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్‌డిఎ శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కూటమి శాసనసభా పక్ష నేతగా ఎ న్నుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ప్రజా తీ ర్పును గౌరవించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తామందిరిపైనా ఉందన్నారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని గుర్తుచేశారు. కేంద్ర ప్ర భుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని వివరించారు.

నిజానికి 2014లో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించినపుడే పో లవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెప్పారు. వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెబుతూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికీ నీళ్లందిస్తామ ని హామీ ఇచ్చారు. సీఎం పర్యటనల సందర్భంగా షాపు లు, రోడ్లు మూసివేయడం, పరదాలు కట్టడం లాంటివి ఇకపై రాష్ట్రంలో కనిపించబోవని చెప్పారు. సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఆపేయడం జరగదన్నారు. ‘ఐదు నిమిషాలు నాకు లేటైనా పర్వాలేదు కానీ ప్రజలకు అసౌకర్యం కలగవద్దని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజాపాలన సాగుతుందని, ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన, ఒక పాజిటివ్ గవర్నమెంట్ ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రజలు తమకు ఇచ్చిం ది అధికారం కాదని,అత్యున్నతమైన బాధ్యత అని పేర్కొన్నారు.

అశాంతికి తావు లేకుండా రాష్ట్రంలో పాలన ఉం టుందన్నారు. విజయవాడలోని ఏ కనెక్షన్‌లో మంగళవా రం జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి పాల్గొన్నా రు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పేరును పవ న్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురంధరేశ్వరి, అచ్చెన్నాయు డు బలపరిచారు. దీనికి కూటమి ఎమ్మెల్యేలంతా ఆమో దం తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘నే ను చాలా ఎన్నికలు చూశాను కానీ ఈ ఎన్నికల్లో ప్రజ లు రాష్ట్ర చరిత్రలో లేనివిధంగా తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇచ్చి న తీర్పును నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉంది. కూ టమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా. కూటమి విజయానికి కష్టపడ్డ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని చంద్రబాబు అన్నారు.

పవన్ మద్దతు ఎప్పుడూ మర్చిపోలేను

అక్రమ కేసులతో నన్ను జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాన్ ఇచ్చిన మద్దతును ఎప్పుడూ మరిచిపోను. నేను రాజమం డ్రి జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. ప్రభుత్వ వ్య తిరేక ఓటు చీలకూడదని గతంలో చెప్పినప్పటికీ జైల్లో నన్ను కలిసిన అనంతరం పొత్తు ప్రకటించారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు చొరవ తీసుకున్నారు. ఎ న్నికల సమయంలో ధర్మవరంలో పర్యటించిన అమిత్ షా వైసీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంతో పాటు ఏపీకి ఏం అవసరమో చెప్పారు. దీంతో ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. కూటమిపై నమ్మకం పెరిగింది. మీ సహకారంతోనే 4వసారి సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేస్తు న్నా. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. మళ్లీ ప్ర జల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్రం ఉ న్న పరిస్థితుల్లో కేంద్ర సహకారం కూడా అవసరం. ఈ మే రకు కేంద్రం కూడా హామీ ఇచ్చింది. మోదీ, అమిత్, నడ్డా తో పాటు కేంద్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని చంద్రబాబు అన్నారు.

గౌరవసభగా శాసనసభను నడుపుదాం

‘కక్ష తీర్చుకోవాలని ముందకెళ్తే సమస్యలే వస్తాయి. అలాగని తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలేస్తే మళ్లీ అదే దారికి వస్తారు. చట్ట పరంగా శిక్షించడంతో పాటు విధ్వంసం, కక్ష రాజకీయాలు చేయకుండా సరైన దారిన పెట్టాలి. కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెట్టి వేధించారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని మనం కాపాడుకున్నాం. నడి వీధుల్లో ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తించారు. మెడపై కత్తి ఉన్నా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిన ఘటన నా కళ్ల ముందు ఇప్పటికీ తిరుగుతోంది. నాకు కూడా అసెంబ్లీలో అవమానం జరిగింది…దాన్ని భరించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి బయటకు వచ్చాను. అసెంబ్లీని గౌరవ సభగా మార్చుతానని చెప్పాను. మనం శాసనసభను గౌరవ సభ గా మార్చి ప్రజా సమస్యలు పరిస్కరించేందుకు వేదికగా మార్చుకుందాం’ అని చంద్రబాబు అన్నారు.

నిర్మాణాత్మక రాజకీయాలు చేద్దాం

‘రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలీదు. ఎక్కడ నుంచి తెచ్చా రో తెలీదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. సాగునీ టి వ్యవస్థ నిర్వీర్యమైంది. వ్యవసాయం రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. ఐదేళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెం చారు. పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి. ప్రజావేదికను కూల్చి దుర్మార్గంగా వ్యవహరించారు. కక్ష పూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజయాలు పాటిద్దాం. మళ్లీ కేంద్ర సహకారంతో పో లవరం పూర్తి చేసి నదులు అనుసంధానంతో చేసి ప్రతి ఎకరాకు నీళ్లందిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News