Friday, January 24, 2025

అశోక్‌బాబుపై ఎపి సిఐడి కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి ఎంఎల్‌సి అశోక్‌బాబుపై ఎపి సిఐడి కేసు నమోదు చేసింది. తన సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదు చేశారు. ఎసిటిఒగా ఉన్నప్పుడు ఫోర్జరీ సమాచారం ఇచ్చారని సిఐడి కేసు నమోదు చేసింది. అశోక్ బాబు ఎపి ఎన్‌జిఒ అధ్యక్షుడిగా పని చేశారు. బికాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు పెట్టారని అభియోగాలు వచ్చాయి. బికాం చదివినట్లు ఎన్నికల అఫిడవిట్‌లో అశోక్‌బాబు సమర్పించారు. కేసు పెండింగ్ ఉండగా తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్‌లో అశోక్‌బాబు తెలిపాడు. ఎపి లోకాయుక్త కేసును విచారించింది. కేసును సిఐడికి అప్పజెప్పాలని లోకాయుక్త ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News