Thursday, December 19, 2024

చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి చేసిన ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. వైసిపి కార్యాలయానికి చేరుకుని అందుకు సంబంధించిన ఆధారాలను వైసిపి నేతలను కోరుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కేసులో సిఐడి చంద్రబాబు ఎ1, నారా లోకేష్ ఎ2 గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఐవిఆర్‌ఎస్ కాల్స్ తో తప్పుడు ప్రచారం చేసినట్లు వైసిపి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.

దీంతో టిడిపిపై చర్యలు తీసుకోవాలని ఇసి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సిఐడి అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో సిఐడి చంద్రబాబు, లోకేష్ తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవిఆర్‌ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీపైన కేసు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News