Monday, January 20, 2025

చంద్రబాబుకు ఎపి సిఐడి మరో షాక్..

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టిడిపి అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి మరో షాక్ ఇచ్చింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమాలపై విచారణ చేపట్టాలని అమరావతి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 2022లో నమోదైన ఈ కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎసిబి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రాగానే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. అందుకే కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కేవలం కాగితాలకే పరిమితమై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో దోచుకున్నారని 2022లో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఇష్టానుసారంగా అలైన్ మెంట్ మార్చారని ఆరోపించారు.

చంద్రబాబు బృందంలో మంత్రిగా ఉన్న నారాయణ కూడా ఈ అవినీతిలో భాగమేనని ప్రభుత్వం చెబుతోంది. ఆ అవినీతిలో భాగంగానే లింగమనేని రమేష్‌తో కుమ్మక్కయ్యి భవనంలో ఉంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తొలుత ఇన్నర్ రింగ్ రోడ్డును 94 కిలోమీటర్లకే పరిమితం చేసిన అధికారులపై ఒత్తిడి తెచ్చి అలైన్ మెంట్ మార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్పు వల్ల చంద్రబాబు, ఆయన అనుచరులు భారీగా లబ్ధి పొందారని విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ విచారణ జరిపి ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ్, ఏ-3గా లింగమనేని రమేష్, ఏ-6గా నారా లోకేశ్ పేర్లను ఖరారు చేసింది. ఇప్పుడు ఈ కేసును తెరపైకి తెచ్చి చంద్రబాబును అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు, నారాయణ కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని కోర్టులో అభ్యర్థన వచ్చింది. ఈ కేసులో చంద్రబాబును విచారించాలని పిటిషన్ కూడా దాఖలైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ వస్తే.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఆయనను వెంటనే అరెస్ట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News