Thursday, January 23, 2025

మాజీ మంత్రి నారాయణకు ఎపి సిఐడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజధాని భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, టిడిపి నేత నారాయణకు ఎపి సిఐడి నోటీసులు జారీ చేసింది. సిఆర్‌పిసి 41ఎ కింద ఈ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలంటూ స్పష్టం చేసింది. నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ ఎండి అంజనీకుమార్‌కు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, ఉద్యోగి ప్రమీలకు కూడా నోటీసులు పంపింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

అమరావతి భూముల కొనుగోలుకు సంబం ధించి ఇటీవల సిఐడి అధికారులు నారాయణ, ఆయన కుమార్తెల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నారాయణ తన సంస్థ ఉద్యోగుల పేరు మీద కూడా భూములు కొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 148 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేసి, తనకు కావల్సిన వారికి అనుకూలంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అలైన్ మెంట్ డిజైన్ మార్చినట్టు నారాయణపై ప్రధాన ఆరోపణ ఉంది. అమరావతి ప్రాంతంలో నిబంధనలకు విరు ద్ధంగా నారాయణ అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి 2020లో కేసు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News