Thursday, January 16, 2025

జమిలి ఎన్నికలను స్వాగతిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

* జమిలి బిల్లుకు మా మద్ధతు
* జమిలి అమల్లోకి వచ్చినా 2029లోనే ఎన్నికలు
* వైసీపీ నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
* 2047 నాటికి ఏపీ నెంబర్ వన్ అవుతుంది
* బీజేపీ అగ్రనేత ఎల్.కే అద్వానీ త్వరగా కోలుకోవాలి
* ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు
* 73 లక్షలకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు
* క్యాడర్, నాయకులకు సీఎం చంద్రబాబు అభినందనలు
* టాప్-5లో రాజంపేట, నెల్లూరు సిటీ, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు
* టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
మన తెలంగాణ/అమరావతి: జమిలి అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం అమరావతిలో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం. వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందన్నారు. ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని, వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని సూచించారు. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోటా చర్చ జరగాలని, విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని కోరారు.

గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికీ కనిపిస్తున్నాయని, 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసేది కాదని, భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047 అని, సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించారు. ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకువస్తామని, సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు-సమాధానాల రూపంలో నిర్వహిస్తామని చెప్పారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరుతామని, దీంతో సమయం సద్వినియోగం కావడంతో పాటు మంత్రులు-అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుందన్నారు. ఆసుపత్రిలో చేరిన బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆడ్వాణీతో నాకు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఆనాడు ఏపీ అభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిది” అని చంద్రబాబు తెలిపారు.

పార్టీ సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు: సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా నేటికి 73 లక్షలకు చేరింది. సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సిఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది. సభ్యత్వ నమోదు అంశాలను ఆ విభాగ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85 వేల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి పొందారు. ఇప్పటి వరకు జరిగిన నమోదులో 54 శాతం మంది కొత్త వారు సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో 1.18 లక్షలతో రాజంపేట మొదటి స్థానంలో ఉండగా, నెల్లూరు సిటీలో 1.06 లక్షలు, కుప్పంలో 1.04 లక్షలు, పాలకొల్లులో 1.02 లక్షలు, మంగళగిరిలో 90 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వ కార్యక్రమంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.

సభ్యత్వ కార్యక్రమంతో పార్టీ బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని సీఎం అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తెలుగుదేశం సభ్యత్వం పొందే పరిస్థితి రావాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమం అందించడంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. స్కిల్ డవలెప్మెంట్, అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యత క్రమంలో అందించడం ద్వారా ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని సిఎం అన్నారు. కేవలం వెల్పేర్ మాత్రమే కాకుండా కార్యకర్తల తలసరి ఆదాయం పెంపుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిఎం తెలిపారు. కష్టపడి పని చేసిన వారికి మెరిట్ పద్దతిలో పదవులు ఇవ్వడంతో పాటు ఆయా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టే కార్యక్రమం పార్టీలో అన్ని స్ధాయిలో జరుగుతుందన్నారు. అనంతరం పార్టీకి చెందిన ఇతర విభాగాల పని తీరుపైనా చంద్రబాబు సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News