అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నాటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సిఎం జగన్‌కు కాలు బెణకడంతో నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సిఎం ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. సిఎం స్థానంలో హోం మంత్రి సుచరిత, డిజిపి గౌతమ్ సవాంగ్ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో ఎపి, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది.కాగా ఎపి సిఎం కాలునొప్పి కారణంగా వైద్యుల సూచనల మేరకు పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఎపి సిఎం ఢిల్లీ పర్యటన రద్దు
- Advertisement -
- Advertisement -
- Advertisement -