Monday, December 23, 2024

కృష్ణకు నివాళులర్పించిన ఎపి సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పద్మాలయా స్టూడియోస్‌కు వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్‌బాబుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సినీనటుడు కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖులు నటుడితో తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తన తండ్రి కృష్ణ ఆకస్మిక మరణంతో మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యాడు. అతని అభిమానులు నటుడి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News