హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, మాధవి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి, గురుమూర్తి, మాధవ్, రంగయ్య, రెడ్డప్ప, సత్యవతి, కోటగిరి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణలు జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సిఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఏపి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి, ఆర్థికశాఖ మంత్రిని సిఎం జగన్ కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు ఆమోదం, ఏపికి ఆర్థిక చేయూత, ఏపి విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపిలో కొత్తగా 13 మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి అంశాలపై సిఎం జగన్ వారితో చర్చించనున్నట్లు సమాచారం.
AP CM Jagan Reached to Delhi will meet PM