Sunday, December 22, 2024

రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్

- Advertisement -
- Advertisement -

విశాఖలోని శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి దీక్షాపీఠం వద్ద పూజలు చేశారు. అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యస్వామిని కూడా దర్శించుకున్నారు. శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానంద సరస్వతి, పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిలను కలుసుకుని, వారితో కాసేపు మాట్లాడారు. తొలుత శారదాపీఠం చేరుకున్న జగన్ కు మంత్రులు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వాగతం పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News