Sunday, January 19, 2025

సిఎం రేవంత్‌పై ఎపి సిఎం జగన్ ఫైర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎపి సిఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడపలోని పొట్టి శ్రీరాము లు సర్కిల్ వద్ద నిర్వహించిన వైసిపి ఎన్నికల సభలో సిఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబును గెలిపించేందుకు ఎపిలో కాంగ్రెస్ రంగ ప్రవేశం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చంద్రబాబు మనిషి అని విమర్శిం చారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అని, చంద్రబాబు పగలు బిజెపితో కాపురం చేస్తారు,

రాత్రి కాంగ్రెస్‌తో కాపురం చేస్తారు అంటూ జగన్ ప్రసంగించారు. ఎన్ని కల వేళ ఎపి సిఎం జగన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేయడం పొలిటికల్ సర్కిల్లో సంచలనంగా మారాయి. ఇదిలా ఉండగా, చంద్రబాబు గురించి సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చంద్రబాబు తనకు గురువు కాదని, నేను సహచరుడిని మాత్రమే అని రేవంత్ చెప్పిన సంగతి విదితమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News