Monday, November 25, 2024

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

ఎపి సిఎం జగన్ త్వరలోనే బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన హైదరాబాదులోని సిబిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అక్రమాస్తుల అభియోగాల నేపథ్యంలో సిఎం జగన్ పై అనేక సిబిఐ కేసులు ఉండడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్నారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ల రాదని కోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో, తాను విదేశాలకు వెళ్లేందుకు వీలుగా బెయిల్ నిబంధనలు సడలించాలని సిబిఐ కోర్టును కోరారు. సిఎం జగన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి సిబిఐ న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐని ఆదేశిం చింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్యన తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని సిఎం జగన్ తన దరఖాస్తులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News