Sunday, January 26, 2025

తెలంగాణ సిఎంకు అభినందనలు తెలుపుతూ ఎపి సిఎం ట్వీట్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలన్నారు. రాష్ట్ర సిఎం, మంత్రులకు సిఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం పరిఢవిల్లాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రా మధ్య సహకారం కొనసాగాలని పిలుపునిచ్చారు. గురువారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News