Monday, December 23, 2024

రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

AP Congress Chief Sailajanath Reddy slams YCP Govt

అమరావతి: రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ కరువవుతోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా? అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచారం? ఘటన అమానవీయమని పేర్కొన్నారు. పోలీసులు నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇంట్లో నుంచి బయటకివెళ్లిన మహిళలు సురక్షితంగా వస్తారా..?, రారా అన్న భయం కలుగుతోందని అన్నారు. దశలేని దిశ చట్టం పేరుతో కాలయాపన చేయకుండా మహిళలపై జరుగుతున్న అకృత్యాల కేసుల్లో జాప్యం లేకుండా తక్షణమే నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

AP Congress Chief Sailajanath Reddy slams YCP Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News