Monday, January 20, 2025

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం: బండి శ్రీనివాసరావు

- Advertisement -
- Advertisement -

అమరావతి: 12వ పిఆర్‌సి ప్రకటించిన సిఎం జగన్ మోహన్ రెడ్డికి ఎపి ఎన్‌జిఒ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు కావాల్సిన రాయితీలను సిఎం ప్రకటించారని ప్రశంసించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యమేనన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరమైన విషయమని బండి కొనియాడారు. సిఎం జగన్ ప్రకటనతో కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల కష్టాలు తీరాయని, చాలా వరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారని, కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై సిఎం జగన్‌కు బండి కృతజ్ఞతలు తెలిపారు. 16 శాతం హెచ్‌ఆర్‌ఎ ప్రకటించినందుకు ధన్యవాదాలు అని, మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు.

Also Read: ప్రేమపెళ్లి చేసుకున్నందుకు 36 సార్లు పొడిచి చంపిన ప్రియుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News