Saturday, December 21, 2024

ఏటా పెరుగుతున్న ఎపి అప్పుల భారం: కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: 2018లో రూ.2,29,33 కోట్లు ఉండగా ప్రస్తుతం 3.602.334 కోట్లకు ఆంధ్రప్రదేశ్ అప్పులు చేరాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. లోక్ సభలో సభ్యుల అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. మరో వైపు ఏటా అప్పుల శాతం ఎపిలో పెరుగుతోందన్నారు. 2017,2018తో పోలిస్తే 9.8 శాతం తగ్గితే, 2020 నాటికి 17.1 శాతం పెరిగిందన్నారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోను మూడేళ్లుగా అప్పులు పెరుగుతున్నాయని వివరించారు. టిడిపి అధికారంలో ఉన్న 2014లో రాష్ట్ర స్తూల జాతియోత్పత్తిలో అప్పుల శాతం 42.3 శాతం ఉండగా అనంతరం భారీగా తగ్గుదల కనిపించిందన్నారు. 2015లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 23.3 శాతం ఉండగా 2021 నాటికి రాష్ట్ర స్థూల జాతియోత్పత్తిలో 36.5 శాతంగా అప్పులు ఉన్నాయని వెల్లడించారు. బడ్జెట్‌లో చూపించిన అప్పుల కంటే బడ్జెతేతర అప్పులను భారీగా ఎపి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News