అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు భక్తులు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. గల్లంతయిన వారిలో వినోద్ అశోక్(విజయవాడ), గునిశెట్టి సుధ(రాజమహేంద్రవరం), మధు(తిరుపతి), ఝాన్సీలక్ష్మి(గుంటూరు) .. నాగేంద్ర(విజయనగరం) ఉన్నట్లు తెలిపారు. గల్లంతైన వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రికుల వివరాలకు ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్ 011-23387089 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెస్క్యూ సిబ్బంది, ఎన్ డిఆర్ఎఫ్, సిఆర్ పిఎఫ్, భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కొండ చరియలు ఏమి విరిగిపడటంలేదని భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలు ఇబ్బంది కలుగుతోందని ఎన్ డిఆర్ఎఫ్ డిజి అతుల్ కర్వాల్ తెలిపారు. అమర్ నాథ్ గుహ నుంచి సుమారు 15 వేల మంది భక్తులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. గాయపడిన 65 మందిని ఆర్మీ హెలికాప్టర్లలో ఆస్పత్రులకు తరలించారు. జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే.