- Advertisement -
అమరావతి: ఎపిలో సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా పెరిగిందని…ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు రాను రాను ఎక్కువతున్నాయని డిజిపి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ సంర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దీన్ని ఎలా అదుపు చేయాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని సూచించారు. నిపుణులు ఉపయోగించుకోవడం.. ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని పేర్కొన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే డబ్బులు చెల్లించవద్దని కోరారు. సైబర్ క్రైమ్ నిరోధించడానికి అవగాహనే ఏకైక మార్గమని డిజిపి స్పష్టం చేశారు. చిన్న పిల్లలు, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని, ఇది సభ్య సమాజం సిగ్గు పడాల్సిన విషయమని డిజిపి ద్వారకా తిరుమల రావు తెలియజేశారు.
- Advertisement -