Wednesday, January 22, 2025

నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ ను ఎపి సర్కార్ విడుదల చేసింది. బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ 6,100 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. 2,280 ఎస్ జిటి పోస్టులు, 1264 టిజిటి పోస్టులు, 215 పిజిటి పోస్టులు ఉన్నాయి.

ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఎపిపిఎస్ సి వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఏప్రిల్ 7వ తేదీన డిఎస్సి ఫలితాలను విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. కాగా, త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ కు ఇటీవల ఎపి కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News