Thursday, July 4, 2024

కూటమి సునామీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కూటమి ప్రభంజనాన్ని సృష్టించింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి మొత్తం 175 స్థానాల్లో టిడిపి 135, జనసేన 21, బిజెపి 8 స్థానాల్లో విజయ దుందుభి మో అధికార వైసిపి ఘోర పరాజయం పాలై ప్రతిపక్ష స్థానాన్ని సైతం కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. గెలవని నియోజకవర్గాల్లోనూ గెలుపుతో టిడిపి ఈ ఎన్నికల్లో హిస్టరీని క్రియేట్ చేసిం ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధించని విజయాలను ఈసారి చవి చూసింది. జనం ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ఒక్కటై సైకిల్ కు జై కొట్టారు. ఎస్‌సి నియోజకవర్గాల్లో సహజంగా తొలి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైసిపికి పట్టు ఉంది. అయితే ఇప్పుడు ఆ చరిత్రను టిడిపి తిరగరాసింది. ఒకటంటూ ఏమీ లేదు. అసలు అభ్యర్థులను చూడలేదు. ఒకే ఒక లక్ష్యం. వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జనం బట న్ నొక్కారని రిజల్ట్ ను చూస్తే అర్థమవుతుంది.

పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు పెద్దయెత్తున స్వాగతం పలికారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు బాణాసంచాను కాల్చి పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు.
సిఎం పదవికి రాజీనామా చేసిన జగన్
ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సిఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను మంగళవారం సాయంత్రం ఎపి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపించారు. ఎపిలో టిడిపి కూటమి సునామీని సృష్టించడం, కూటమికి 165 సీట్లు రాగా, వైసిపి 10 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ప్రమాణస్వీకారం, క్యాబినెట్ ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పవన్‌తో చంద్రబాబు భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
ఎన్నికల ఫలితాల్లో విస్పష్టమైన మెజార్టీ రావడంతో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. గుంటూ జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించా రు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా భేటీ అయిన నేతలు ప్రభుత్వ ఏర్పాటు, సిఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం.
జూన్ 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం?
అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో టిడిపి అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీని పార్టీ నేతలు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 9న రాజధాని అమరావతి కేంద్రంగా సిఎంగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.

8 జిల్లాల్లో ఖాతా తెరవని వైసిపి
ఎపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. అ యితే మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసిపి ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా ఎనిమిది జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూ డా తెరవలేదు. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయ నగరం, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా వైసిపి గెలవలేకపోయింది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్వీప్ చేయటం ఇదే తొలిసారి.
కుప్పంలో చంద్రబాబు ఘన విజయం
టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. తన సమీప వైసిపి ప్రత్యర్థి కెఆర్ జె భరత్‌పై చంద్రబాబు 47,340 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి చంద్రబాబుకు 1,20,926 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి భరత్‌కు 73,585 ఓట్లు వచ్చాయి.

వైసిపి కంచుకోటలో టిడిపి విజయం
వైసిపి కంచుకోట కడప జిల్లాలో టిడిపి జెండా ఎగిరింది. కడప అసెం స్థానం నుంచి టిడిపి తరపున పోటీ చేసిన రెడ్డప్పగారి మాధవిరెడ్డి విజయం సాధించారు. వైసిపి అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భా షాపై గెలుపొందారు. అటు ప్రొద్దుటూరులో వైసిపి అభ్యర్జి రాచమల్లు పై టిడిపి నేత వరదరాజులరెడ్డి గెలిచారు. అలాగే ఉరవకొండ పయ్యావుల కేశవ్(టిడిపి), ప్రత్తిపాడులో సత్యప్రభ(టిడిపి), రాజానగరంలో బత్తుల రామకృష్ణ (జనసేన), తణుకు-అరిమిల్లి రాధాకృష్ణ(టిడిపి), గాజువాకలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై పల్లా శ్రీనివాస్‌రావు విజయం సాధించారు. అటు ఆచంటలో టిడిపి అభ్యర్థి పితాని సత్యనారాయణ, పార్వతీపురంలో టిడిపి అభ్యర్థి బొనెల్ విజయ్ గెలుపొందారు. అలాగే ఉండిలో రఘురామకృష్ణంరాజు(టిడిపి), భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు 60 వేల మెజార్టీతో గెలిచారు.

భారీగా తగ్గిన జగన్ మెజార్టీ
వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డికి 61,169 ఓట్ల మె వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన 90 వేలకుపైగా మెజార్టీ సాధించారు. కానీ ఈ సారి ఆయన మెజార్టీ 30వేలకు తగ్గిపోయింది.
గుడివాడలో కొడాలి నానికి ఘోర ఓటమి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు -2024లో పలువురు వైసిపి సీనియర్ నేతలు అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు. ఆ జాబితాలో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, వైసిపి కీలక నేత కొడాలి నాని (వెంకటేశ్వర రావు) కూడా చేరిపోయారు. తన ప్రత్యర్థి, టిడిపి నేత వెనిగండ్ల రాము చేతిలో ఆయన దారుణ ఓటమిని చవిచూశారు. వెనిగండ్ల రాము ఏకంగా 51 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

షర్మిల ఓటమి
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక్కడ 60 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందగా.. షర్మిలకు కేవలం 1.35 లక్షల ఓట్లే వచ్చాయి. తన తమ్ముడు అవినాష్‌కు 5 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. అవినాష్‌కు టిడిపి అభ్యర్థి సుబ్బరామిరెడ్డి గట్టి పోటీ ఇచ్చారు.
ఎపి ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు : ప్రధాని మోడీ
ఎపిలో బిజెపి–టిడిపి–జనసేన కూటమి అద్భుత ఫలితాలు సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘ఈ మహత్తర విజయం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, టిడిపి, జనసేన, ఎపి బిజెపి కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎపి సర్వతోముఖాభివృద్ధికి మేం కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఎపి మరింత అభివృద్ధి చెందేలా పాటుపడ తాం‘ అని ప్రధాని మోడీ వివరించారు.

కెసిఆర్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు.
కెటిఆర్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, -జనసేన, -బిజెపి కూటమి అద్భుత విజయం సాధించినందుకు గాను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రజలు మరింత విజయపథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News