Thursday, December 19, 2024

ఏపీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన!

- Advertisement -
- Advertisement -

ఏపీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలుపు దిశగా జనసేన ఆధిక్యంలో దూసుకుపోతోంది. రెండు లోక్ సభ స్థానాల్లో కూడా గెలుపు బాటలో జనసేన పయనిస్తోంది. దీంతో 100 శాతం స్ట్రైక్ రేటుతో జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో జనసేనకు గ్లాజు గాసు గుర్తు ఇకనుంచి శాశ్వతం కానుంది.

కాగా, 21 స్థానాల్లో ఇప్పటికే ఏడు స్థానాల్లో జనసేన గెలుపొందింది. పిఠాపురంలో జనసేనాని 50వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News