- Advertisement -
అమరావతి: అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆరోపణలు ఎదురుకుంటున్న ఎపి సిఐడి మాజీ చీఫ్, ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటుపడింది. 2020 నుంచి 2024 మధ్యకాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన సునీల్ కుమార్ అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారని ఎపి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై గతంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నేతృత్వంలో కమిటీ విచారణ జరిపింది. ఈ విచారణలో ఆయన అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినట్లు తేలింది. ఈ క్రమంలో సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -