Sunday, December 22, 2024

చంద్రబాబును ఎసిబి కోర్టులో హాజరుపర్చిన సిఐడి సిట్…

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ సిట్ అధికారులు ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా సిఐడి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో సిఐడి మెమో దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబును మరింత విచారించేందుకు కస్టడికి ఇవ్వాలని సిఐడి సిట్ కోర్టును కోరగా.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం ఎసిబి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

కాగా, ఎపి ప్రభుత్వం చేపట్టిన స్కిల్‌డెవలప్‌మెంట్ పథకంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అప్పటి సిఎం చంద్రబాబు నాయుడును పోలీసులు నంద్యాలలో శనివారం అరెస్టు చేశారు. దీంతో చంద్రబాబు తరఫు లాయర్ సిద్దార్థ్ లూథ్రా సిట్ కార్యాలయానికి వచ్చారు. బాబు తరఫున వాదించేందుకు లూథ్రాను ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా పిలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News