Monday, January 20, 2025

డ్రగ్స్ కేసులో మాజీ ఎంపి కుమారుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

AP Ex MP DK Adikesavulu's Son arrested in Drugs Case

మనతెలంగాణ/హైదరాబాద్: డ్రగ్స్ కేసులో దివంగత ఎంపి డికె ఆదికేశవులు నాయుడు కుమారుడు డికె శ్రీనివాసులు నాయుడును బుధవారం బెంగళూరులో నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ (ఎన్‌సిబి) అధికారులు అరెస్ట్ చేశారు. రాజకీయ, సినీ ప్రముఖులకు శ్రీనివాసులు నాయుడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో ఎన్‌సిబి అధికారులు బెంగళూరులోని శ్రీనివాసులు నాయుడు సహా పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీనివాసులు నాయుడు ఇంట్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడినట్లు సమాచారం. చిత్తూరు కేంద్రంగా రాజకీయాలు సాగిస్తున్న డికె ఆదికేశవులు నాయుడు కుటుంబం బెంగళూరు కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరులోనే శ్రీనివాసులు నాయుడు ఉంటూ ఎపి, కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులతో సంబంధాలు నెరపుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో శ్రీనివాసులు నాయుడు ఇంట్లో లభించిన డ్రగ్స్‌పై అనతికాలంలో వివరాలు వెల్లడిస్తామని ఎన్‌సిబి అధికారులు వివరించారు.

AP Ex MP DK Adikesavulu’s Son arrested in Drugs Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News