Monday, January 20, 2025

ఢిల్లీకి చేరిన దొంగ ఓట్ల పంచాయతీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ దొంగ ఓట్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. కేంద్రం ఎన్నికల కమిషన్ కి వైసిపి, టిడిపి పరస్పరం ఫిర్యాదులు చేశాయి. వైసిపి ఎంపిలు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎపిలో తెలుగుదేశం పార్టీ దొంగ ఓటర్లను చేర్పించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ జాబితాలో టిడిపి చేర్పించిందని ఆరోపించింది. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటర్లను నమోదు చేయించారని వైసిపి పేర్కొంది. హైదరాబాద్ , కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న వారిని కూడా నమోదు చేయించారని వైసిపి నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News