పత్రికల ప్రకటనతో జగన్ సర్కారు షాక్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వపు ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించేది లేదని స్పష్టం చేసింది. పెట్రోలు డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాల తగ్గింపు అనుగుణంగా వ్యాట్‌లో కోతకు దిగే పరిస్థితి లేదని తెలిపింది. పైగా వ్యాట్‌ను తగ్గించకపోవడానికి కారణాలను, తమ రాష్ట్ర వైఖరిని సమర్థించుకుంటూ పత్రికలలో పూర్తి స్థాయిలో ఒక పేజీ వివరణాత్మక ప్రకటన వెలువరించింది. పన్నుల విషయంలో తమ ప్రభుత్వ వైఖరి ఇదేనని, ప్రజులు దీనిని గుర్తించి , అర్థం చేసుకోవాలని ఇందులో సిఎం జగన్ విజ్ఞప్తి చేసుకున్నారు. కేంద్రం పన్నులు తగ్గిస్తే రాష్ట్రం ఎందుకు కిమ్మనకుండా ఉందని, వెంటనే కుదించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పత్రికలక ఈ ప్రకటన వెలువరించింది. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం కోటాలో రాష్ట్రం ఇప్పటికే రూ 3.35 లక్షల కోట్లు వసూలు చేసి పెట్టిందని, మరి దీనికి అనుగుణంగా కేంద్రం రాష్ట్రానికి ఎందుకు తగు వాటా అందించడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీసింది.