Wednesday, January 22, 2025

ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం పని చేస్తుంది: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: సంక్షేమం అనేది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు తొలి అడుగు పడిందన్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్లను సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం మసీదు సెంటర్‌లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులతో చంద్రబాబు ముచ్చటించారు. కొత్త ప్రభుత్వంలో తొలుత పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని, సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు అని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ అనే వారని గుర్తు చేశారు. ఎన్‌టిఆర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఆంధ్ర ప్రజల ఆశీస్సులతోనే నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశానని చెప్పారు. దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్లు పెంచామని, వారికి చేయూతనివ్వడం సామాజిక బాధ్యత అని బాబు తెలిపారు. పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంతో పాటు ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని, మాది ప్రజా ప్రభుత్వం అని, నిరంతరం ప్రజలకోసమే పని చేస్తానని, ప్రజలు నిండు మనస్సు ఆశీర్వదించి తమ ప్రభుత్వానికి సహకరించాలని బాబు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News