Monday, January 20, 2025

గ్రామ సచివాలయాల్లో కారుణ్య నియామకాలకు ఎపి సర్కార్ అనుమతి

- Advertisement -
- Advertisement -

CM Jagan responded to Pawan's comments on YCP leaders

మన తెలంగాణ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామవార్డు, సచివాలయాల్లో కారుణ్య నియమాకాల ద్వారా ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆ రాష్ట్ర సిఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం కారుణ్య నియామకాల భర్తీకి సంబంధించి జీవో నెంబర్ 7ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో కారుణ్య నియామకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న 300 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపింది. గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు సిఎం జగన్ అండగా నిలిచి తమ బాగోగులు చూసుకుంటున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంకమ్మరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News