Tuesday, November 5, 2024

కరోనాతో మృతిచెందిన వైద్యసిబ్బంది కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా..

- Advertisement -
- Advertisement -

అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ ఎంతో మంది కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. వైరస్ కారణంగా తల్లిదండ్రులు మరణించడంతో ఎంతోమంది చిన్నారు అనాథలైయ్యారు. కరోనా బాధితులకు చికిత్స చేస్తూ చాలా మంది వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైద్య సిబ్బంది కుటుంబాలకు ఎపి ప్రభుత్వం అండగా నిలిచింది. కరోనాతో మృతిచెందిన వైద్యసిబ్బంది కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కేటగిరీల వారిగా పరిహారం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో వైద్యులు మరణిస్తే రూ.25 లక్షల పరిహారం, స్టాఫ్ నర్సులు మరణిస్తే రూ.20 లక్షలు, ఎంఎస్ఒ, ఎఫ్ఎస్ఒలు మరణిస్తే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది మరణిస్తే రూ.10 లక్షల పరిహారం వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt announce ex gratia to medical staff who died with Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News