Wednesday, December 25, 2024

మే నెల పింఛన్ లబ్ధిదారుల ఖాతాలో జమ.. అందోళనలో వృద్ధులు

- Advertisement -
- Advertisement -

మే నెల పింఛన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటివరకు గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటివద్దనే పింఛన్ నగదును తీసుకునే లబ్ధిదారులు.. మే, జూన్ నెలలో మాత్రం బ్యాంకుకెళ్లి తీసుకోవాల్సిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మే, జూన్‌ నెలల పింఛన్‌ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌(ఏఈపీఎస్‌) విధానంలో లబ్ధిదారుల ఆధార్‌ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేసింది. అయితే, బ్యాంకు అకౌంట్లు లేనివారికి, వికలాంగులకు ఇంటివద్దనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా బ్యాంక్ కు వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకోవడంపై వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. ఈ మండుటెండలో పింఛన్ డబ్బుల కోసం పక్కూరిలో ఉండే బ్యాంక్ కు ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం.. బ్యాంకుల్లో క్యూలైన్లలో నిలబడడం తమ వల్ల కాదంటున్నారు. కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) లేకపోతె కొంత పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉండడంతో.. కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు వాపోతున్నారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తే… సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు వస్తుందని.. దానిని సహించలేక చంద్రబాబు కుట్ర చేశారని మండిపడుతున్నారు. ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని వృద్ధులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News