Monday, November 18, 2024

రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ..

- Advertisement -
- Advertisement -

AP Govt deposited Rs 2190 cr into farmers accounts

అమరావతి: ఎపి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మూడు పథకాల కింద నేరుగా రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమచేసింది. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సిఎం వైయస్ జగన్ కంప్యూటర్ మీట నొక్కి రైతుల ఖాతాలో డబ్బు జమ చేశారు. దీంతో మొత్తం 50.37 లక్షల మందికి రూ.2,052 కోట్ల వైయస్ఆర్ రైతుభరోసా సొమ్ము జమ అయ్యింది.
లక్షలోపు పంట రుణాలు తీసుకున్న 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్ల సున్నా వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. యంత్ర పరికరాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీ అందజేసింది. ప్రస్తుతం ఇస్తున్న రెండోవిడత సాయంతో కలిపి 2019 నుంచి ఇప్పటివరకు వైయస్ఆర్ రైతుభరోసా కింద రైతులకు రూ.18,777 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది.

AP Govt deposited Rs 2190 cr into farmers accounts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News