- Advertisement -
అమరావతి: పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఎపి జేఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంగళవారం కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కర్నూలులో జరిగిన నిరసనల్లో పాల్గొన్న బొప్పరాజు మాట్లాడుతూ.. పీఆర్సీ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమం చేసేందుకు సిద్ధమయ్యామన్నారు.ఇన్నాళ్లూ ప్రభుత్వం తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని తాము ఇరుకునపడేయలేదన్నారు. మొక్కుబడిగా ఒకట్రెండు సమావేశాలను నిర్వహించి చేతులు దులుపుకుందని, దాని వల్ల ఉద్యోగులకు కలిగిన ప్రయోజనమేమీ లేదని విమర్శించారు. పీఆర్సీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
AP Govt Employees Demand to Govt on PRC
- Advertisement -