Thursday, January 23, 2025

ఎపి, తెలంగాణలో ‘ఆచార్య’ టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆచార్య మూవీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. పది రోజుల పాటు రూ.50 అదనంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 AP Govt green signal to hike Acharya ticket rates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News