Sunday, November 3, 2024

సిజెఐ ఎన్‌వి రమణకు ఎపి ప్రభుత్వం తేనీటి విందు

- Advertisement -
- Advertisement -
AP Govt honeymoon dinner for CJI NV Ramana
సిజెఐకి స్వాగతం పలికిన సిఎం దంపతులు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సిజెఐ ఎన్‌వి రమణకు శనివారం నాడు ఎపి ప్రభుత్వం ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సిజెఐకు ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.ఈక్రమంలో ఎపి ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సిజెఐ ఎన్‌వి రమణకు సిఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఎపి, తెలంగాణ చీఫ్ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు. కాగా అంతకుముందు నోవాటెల్ హోటల్‌లో సిజెఐ ఎన్‌వి రమణను సిఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిసి తేనీటి విందుకు ఆహ్వానించారు.

క్రిస్మస్ వేడుకల్లో సిజెఐ 

ఎపిలోని విజయవాడ నోవాటెల్ హోటల్‌లో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో సిజెఐ ఎన్‌వి రమణ పాల్గొన్నారు. హోటల్‌కు విచ్చేసిన బిషప్‌లు.. క్రిస్మస్ సందర్భంగా జస్టిస్ ఎన్‌వి రమణతో కేక్ కట్ చేయించారు. అనంతరం బిషప్‌లకు సిజెఐ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, కేక్ తినిపించారు. ఈ వేడుకల్లో సిజెఐతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

దుర్గమ్మ దర్శనం 

విజయవాడ ఇంద్రకీలాద్రీపై కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ దంపతులు శనివారం నాడు దర్శించుకున్నారు. వారిని వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సిజెఐకి దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్, కలెక్టర్ నివాస్, ఆలయ ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, ఎంపీ కేశినేని నాని, మంత్రి పేర్ని నాని స్వాగతం పలికారు. కనకదుర్గమ్మను ఎపి హైకోర్టు సిజె ప్రశాంత్ కుమార్ మిశ్ర దర్శించుకున్నారు.

సిజెఐ దంపతులకు ఘన సత్కారం 

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జస్టిస్ ఎన్‌వి రమణ దంపతులను శనివారం ఘనంగా సన్మానించారు.ఈ క్రమంలోనే జస్టిస్ ఎన్‌వి రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని రోటరీ క్లబ్ అందజేసింది. మరొకవైపు నగరంలోని సిద్ధార్ధ అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన పౌర సన్మానసభలో సిజెఐ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జి జెకె మహేశ్వరి, ఎపి హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీఎస్ హైకోర్టు సిజె సతీష్ చంద్రలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News