హైదరాబాద్: సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం సాయంత్రం కొత్త జీఓని విడుదల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతోషం వ్యక్తం చేసింది. ”ఎన్నో ఏళ్ల సమస్యకు ముఖ్యమంత్రి జగన్ పరిష్కారం చూపారు. సమస్యల పరిష్కారంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారు. త్వరలో సిఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెబుతాం. వైజాగ్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తాం” అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది.
కొత్త జీఓని ప్రకారం రాష్ట్రంలో టికెట్ల రేట్లు కనిష్టంగా రూ.20, గరిష్టంగా రూ.250గా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏరియాను బట్టి థియేటర్లను నాలుగు రకాలుగా విభజించి టికెట్ రేట్లను పెంచింది. ఇక హీరో, డైరెక్టర్ పారితోషికం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లను 10 రోజులు పెంచుకునేలా అవకాశం కల్పించింది. అయితే ఏపిలో 20 శాతం షూటింగ్ చేసిన సినిమాలకు మాత్రమే ఈ రేట్ల పెంపు వర్తిస్తుందని ఏపి ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా చిన్న సినిమాలకు ఐదు షోలు వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.
AP Govt Issued New GO for Movie Ticket Prices