Sunday, January 19, 2025

కృష్ణాజలాలు వాడుకునే హక్కు మాదే..ట్రిబ్యునల్‌కు ఏపి లేఖ

- Advertisement -
- Advertisement -

కృష్ణానదీజలాలను వినియోగించుకునే హక్కు తమకే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. శనివారం నాడు ట్రిబ్యునల్‌కు లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీజలాలు వినియోగించుకున్నప్పటికీ ,కరువు ప్రభావిత ప్రాంతాల్లో కృష్ణానదీజలాలను వాడుకునే హక్కు దిగువ రాష్ట్రంగా ఏపికే ఉన్నట్టు తెలిపింది. కృష్ణానదీ బేసిన్ పరిధిలో పాత ప్రాజెక్టుల కింద నీటి వినియోగానికి రక్షణ ఉందని , అందువల్ల ఈ అంశాన్ని సమీక్షించడం సరికాదని తెలిపింది. కృష్ణాజలాల వినియోగంలో జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. ఈ నెల 20న ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనలు వినిపించనున్నట్టు ఈ మేరకు లేఖ ద్వారా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News